
సామాజిక సేవే యువమంచ్ లక్ష్యం
తాండూరు టౌన్: సామాజిక సేవా కార్యక్రమాలే మార్వాడీ యువమంచ్ లక్ష్యమని సంస్థ తాండూరు అధ్యక్షుడు అనిల్ సార్డా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బాలాజీ మందిర్‌లో ది స్టార్ ఆసుపత్రి నానక్‌రాంగూడ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్ సార్డా మాట్లాడుతూ.. సమాజానికి తమ వంతుగా ఏదో ఒకటి చేయాలనే తపనతో మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు, రక్తదానం, నేత్రదాన శిబిరాలు, చలివేంద్రాలు, ఉచిత కృత్రిమ అవయవాల అమరిక, పేద విద్యార్థులకు చేయూత వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. శిబిరంలో కార్డియాలజి, ఆర్థోపెడిక్ వంటి సేవలతో పాటు మరిన్ని వైద్య సేవలను అందించామన్నారు. కార్య క్రమంలో మంచ్ క్యాంప్ చైర్మన్ దీపక్ బూబ్, తాండూరు ప్రధాన కార్యదర్శి సచిన్ రాఠి, సభ్యులు అంకిత్ సార్డా, గిరిధర్ పర్తాని, రోహిత్ సోని, నిఖిల్ గగరాణి, దీపక్ సోని, సన్నీ అగర్వాల్, కుంజ్ బిహారీ సోని, మహేష్ సార్డా తదితరులు పాల్గొన్నారు.