రుణ ప్రణాళిక ఖరారు | - | Sakshi
Sakshi News home page

రుణ ప్రణాళిక ఖరారు

Jul 8 2025 7:16 AM | Updated on Jul 8 2025 7:16 AM

రుణ ప్రణాళిక ఖరారు

రుణ ప్రణాళిక ఖరారు

● ఏటా పరిమితి పెంపు ● లక్ష్యం చేరుకోవడంలో విఫలం ● గతేడాది 60 శాతానికే పరిమితం ● తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్న రైతులు ● ఈ ఏడాది రుణ లక్ష్యంరూ. 8,525 కోట్లు

వికారాబాద్‌: ఎట్టకేటకు బ్యాంకర్లు రెండు రోజుల క్రితం రుణ ప్రణాళిక విడుదల చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు తదితర రంగాలకు ఆయా రంగాల ప్రాధాన్యత మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత రుణం ఇవ్వాలనే ప్రణాళికను కలెక్టర్‌కు నివేదించారు. గతేడాది పెట్టుకున్న లక్ష్యాలతో పాటు అందులో ఏయే రంగంలో ఎంతెంత రుణం ఇచ్చారనే విషయాలపై చర్చించారు. గత లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమైన బ్యాంకర్లు మళ్లీ అంతకు మించి లక్ష్యాలను సిద్ధం చేశారు. గతేడాదికి సంబంధించి 60 శాతం లక్ష్యాన్ని మ్రాతమే చేరుకున్నారు.

లక్ష్యం చేరుకోవడంలో నిర్లక్ష్యం

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను లక్ష్యానికి మించి అందజేస్తున్న బ్యాంకర్లు పంట రుణాల విష యంలో మాత్రం విఫలమవుతున్నారు. జిల్లాలో 3.12 లక్షల మంది రైతులుండగా వీరిలో 1,86,107 మందికి ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. గతే డాది ఈ ఖాతాదారులకు రూ.3,547 కోట్లు వ్యవ సాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. వానాకాలం, యాసంగి సీజన్‌లు కలుపుకొని రూ.2,014 కోట్లు అనగా 60 శాతంలోపే రుణాలిచ్చారు. దీర్ఘ కాలిక రుణాల్లో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

2025–26గాను రూ.8,525 కోట్ల లక్ష్యం

వ్యవసాయ, అనుంబధ రంగాలు, ఇతర రంగాల ను కలుపుకొని 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2,69,593 మంది ఖాతాదారులకు రూ.8,525 కో ట్లు రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యం పెట్టుకున్నా రు. పంటరుణాలు రూ.2582 కోట్లు, వ్యవసాయ, అనుంబంధ రుణాలు (వానాకాలం, యాసంగి) రూ.3,547 కోట్లు , సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఔత్సాహికులకు రూ.608 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1,190 కోట్లు, అప్రధాన్యతా రంగాలకు చెందిన రూ.1,092 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement