
వన మహోత్సవాన్ని సక్సెస్ చేద్దాం
తాండూరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌డీఏ శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన ఉపాధి హామీ పథకం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. విరివిగా మొక్కలు నాటి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. తాండూరు పరిసరాల్లో సిమెంట్ పరిశ్రమలు, నాపరాతి గనులు, పాలి షింగ్ యూనిట్లు ఎక్కువగా ఉండటంతో కాలు ష్యం వెదజల్లుతోందని, ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మొక్కల పెంపకమే మార్గమన్నారు. ఆయా మండలాలను కేటాయించిన మొక్కల లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ సరళ, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఏపీవోలు నరోత్తంరెడ్డి, నర్సింలు, జనార్దన్, శారద, ఈసీలు మధుసూదన్‌రెడ్డి, కృష్ణ, శ్రవణ్, నర్సిరెడ్డి ఉన్నారు.
డీఆర్‌డీఏ శ్రీనివాస్