
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది
తాండూరు రూరల్: ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవిగౌడ్ అన్నారు. సోమవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జినుగుర్తి జెడ్పీహెచ్‌ఎస్ జీహెచ్‌ఎం మృత్యుంజయస్వామి పదవీవిరమణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేశక్తి ఉపాధ్యాయుడికే ఉంటుందన్నారు. బడి లేని ఊరు ఉంటుందేమోకాని ఉపాధ్యాయుడు లేని ఊరు ఉండదన్నారు. 38 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి మృత్యుంజయస్వామి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, అమర్‌నాథ్, గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఏంఈఓ వెంకటయ్య, తాండూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు వినోద్‌కుమార్, పురుషోత్తంరెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, నాగప్ప, కిష్టప్ప, అంబమ్మ, రాంనర్సింహారెడ్డి, ప్రభు, బాల్‌రాజ్, రాజేశ్వర్, శ్రీధర్, సతీశ్ తదితరులు ఉన్నారు.
డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవిగౌడ్
ఘనంగా మృత్యుంజయస్వామి
పదవీవిరమణ కార్యక్రమం