
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై
శంషాబాద్: 15 రోజుల కిందట సాతంరాయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న చిరువ్యాపారాలకు సంబంధించిన డబ్బాలు తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి అందిన ఆదేశాలను అధికారులు క్షణాల్లో పూర్తి చేశారు. పక్కాగా పోలీసుల సహకారంతో జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడున్న గరీబోళ్ల డబ్బాలను వెంటనే తొలగించి పెద్దసార్ల ఆదేశాలను ఆదేశాలను తూచాతప్పకుండా పూర్తి చేశారు. నాలాను ఆనుకుని ఆక్రమణలున్న కారణంగానే ఫిర్యాదులు అందగానే వాటిని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు.
మరి ఇక్కడ..?
శంషాబాద్ పట్టణ ప్రధాన కేద్రంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కరంగా మారుతున్న ఫుట్‌పాత్‌ల ఆక్రమణపై మున్సిపల్ అధికారులు ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అనేక మార్లు ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కౌన్సిల్‌లో తీర్మానాలు చేసి అవి కార్చాచరణకు నోచుకున్న దాఖలు కూడా లేవు. రోడ్డులను ఆక్రమించి హోటళ్లు, వ్యాపారాలు చేసుకుంటున్నా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు.
అద్దెకిచ్చేస్తున్నారు...
ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొందరు సొంత వ్యాపారాలను విస్తరిస్తుండగా మరికొందరు తమ దుకాణాల ముందు చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నారు. రోడ్డును అద్దెకిచ్చి ఏళ్లుగా లక్షల రూపాయలు సంపాదిస్తున్న తీరు కూడా ఇక్కడ షరామాములే అన్నట్లుగా మారింది. పట్టణంలోని రాళ్లగూడ రహదారిలో ఫిరంగి నాలాను ఆనుకుని పదుల సంఖ్యలో డబ్బాలను ఏర్పాటు చేసి అద్దెకిచ్చేస్తున్నారు. దీనిపై ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ కారణంగా సాధారణ ప్రజలతో పాటు ప్రయాణికులు సైతం నిత్యం నరకం చూస్తున్నారు. జనాభా రద్దీలేని సాతంరాయిలో పెద్దసార్ల ఆదేశాలతో ఆగమేఘాల మీద ఆక్రమణ తొలగింపులు చేసిన అధికారులు అదే రీతిన పట్టణంలో ఉన్న ఫుట్‌పాత్‌ల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హైవే ఫుట్‌పాత్‌పై కంటైనర్ వేసి ఏర్పాటు చేసిన హోటల్
శంషాబాద్‌లో విచ్చలవిడిగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణ
కంటైనర్ల ఏర్పాటు చేసిదందా చేస్తున్నా చర్యలు శూన్యం
సాతంరాయిలో యుద్ధప్రాతిపదికన డబ్బాలు తొలగించిన మున్సిపల్ అధికారులు
పట్టణ ప్రధాన కేంద్రంలో పట్టించుకోని యంత్రాంగం
ఆక్రమణలను తొలగిస్తాం..
పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని ఉ న్న కట్టడాలు, డబ్బాలను తప్పకుండా తొలగిస్తాం. రహదారులను ఆక్రమించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు ఎవరివైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– సుమన్‌రావు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై