సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
యాలాల: సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పగిడియాల ఉన్నత పాఠశాల జీహెచ్‌ఎం క్రిష్ణయ్య అన్నారు. మంగళవారం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిట్ల శ్రీనివాస్ తన కుమారుడు పిట్ల ప్రణయ్‌కుమార్‌ను ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎం మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పిట్ల శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.


