మోహన్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
దౌల్తాబాద్: ప్రజా సంక్షేమానికి పరితపించిన నాయకుడు మోహన్‌రెడ్డి అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్‌నాథ్‌రెడ్డి, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి అన్నారు. ఆదివారం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోహన్‌రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద వారు పార్టీ శ్రేణులతో కలిసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 30 ఏళ్ల రాజకీయంలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన ఆయన ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోహన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గురునాథ్‌రెడ్డి


