
ప్రారంభమైన ఎఫ్‌ఐఆర్ నమోదు
దుద్యాల్: ఎట్టకేలకు దుద్యాల్ పోలీస్ స్టేషన్లో సేవలు ప్రారంభమయ్యాయి. కొంత కాలంగా సాక్షి దినపత్రికలో పేరుకే పోలీస్ స్టేషన్, అందుబాటులో లేని సేవలు అని వరుస కథనాలు ప్రచూరించింది. దీంతో స్పందించిన అధికారులు సేవలను ఇటివలే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్‌ఐ యాదగిరి మాట్లాడుతూ కొన్ని నెలలుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు సేవలు అందుబాటులో లేకపోవడంతో మండల వాసులను పాత మండల పోలీస్ స్టేషన్‌కే రెఫర్ చేశామన్నారు. ఈ నెల 1వ తేదీన పోలీస్ స్టేషన్‌కు సాంకేతిక సామాగ్రి వచ్చాయని, వాటి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌కు సమయం పట్టిందని ఎస్‌ఐ తెలిపారు. రెండు రోజుల నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సేవలు, కేసుల నమోదు ఇక నుంచి దుద్యాల్ మండల కేంద్రంలోనే ఉంటాయని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. మండల కేంద్రంలో 16 సీసీ కెమెరాలు ఉండగా, 9 పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మిగితావి కొంత రిపేర్‌లో ఉన్నాయని త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మండల పరిధిలోని చిలుముల మైల్వార్ గ్రామంలో మరో రెండు సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచామని వివరించారు.
సిబ్బంది కొరత..
దుద్యాల్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉంది. స్టేషన్ ప్రారంభించిన నాడు ఎస్‌ఐతో కలిపి 27 మంది సిబ్బందిని కేటాయించింది. గతంలో కొంత మంది సిబ్బందిని ఇక్కడి నుంచి వేరే స్టేషన్‌కు బదిలే చేశారు. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో ఎస్‌ఐ, ఒక ఏఎస్‌ఐ, 17 మంది కానిస్టేబుల్ (ఒక మహిళతో కలిపి) అందుబాటులో ఉన్నారు. ఇంకా ఒకరు మహిళ సిబ్బందితో పాటు కొంత మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈ విషయమై ఎస్‌ఐ యాదగిరిని వివరణ కోరగా త్వరలో బదిలీలు చేపట్టే అవకాశం ఉంటుందని, అప్పుడు సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
దుద్యాల్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన
నాలుగు నెలలకు సేవలు ప్రారంభం
వరుస కథనాలకు స్పందన

ప్రారంభమైన ఎఫ్‌ఐఆర్ నమోదు