
పాకిస్తానీలను పంపించండి
కుల్కచర్ల: భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీలను దేశం నుంచి పంపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కరణం ప్రహ్లాదరావు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతం పేరుతో ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తానీలను భారతదేశం నుంచి వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారందరి ధ్రువపత్రాలను పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు వెంకటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్యముదిరాజ్, నాయకులు జానకీరాంచౌహాన్, అంజిలయ్య, నరేష్, వెంకటేష్, మహేష్, కె.మహేష్, మల్లేశశం, హన్మంతు, గాదె మల్లేష్, శివసంతోష్, ధను, ప్రశాంత్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ప్రహ్లాదరావు