
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కడ్తాల్: రైతు సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ముద్వీన్ గ్రామంలో పీఏసీఎస్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతన్నలకందిస్తున్న చేయూతతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దన్నారు. వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,320 మద్దతు ధర నిర్ణయించిందని, సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ సత్యం, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కడ్తాల్, తలకొండపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బీచ్యానాయక్, ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ దేవేందర్, మండల వ్యవసాయ అధికారులు శ్రీలత, అరుణకుమారి పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి