
తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం
పరిగి: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆలోచన విధానం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల తో పాటు కులగణన చేపడతామని కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కులగణన చేపట్టి 42శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని వివరించారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి
ఈ నెల 7న ఉదయం 11 గంటలకు వికారాబాద్ పట్టణ కేంద్రంలోఎన్నెపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసి న అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్పీకర్ ప్రసా ద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పా రు. మధ్యాహ్నం 3గంటలకు విగ్రహావిష్కరణ అ నంతరం సత్యభారతి ఫంక్షన్‌హాల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ –ఎ అధ్యక్షుడు పార్థసారథి పంతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, దోమ మండల అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనారాయ ణ, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, రాఘవేందర్ రెడ్డి, యాదయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేష్, వెంకటేష్, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్, మాధవరెడ్డి, ఆరిఫ్, పటేల్, నేపాల్ రెడ్డి, రవీందర్, పులిందర్, మహేష్, బాలు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి