అనంతగిరి: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తుందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కులలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను స్థానిక బూత్ కమిటీ అధ్యక్షులు సుద్దగళ్ల లింగమయ్య, మైస నరేష్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదానందరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులను ఇస్తుందన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కృషితో మరిన్ని నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ వడ్ల నందు, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి నవీన్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ గోపాల్, యువకులు పాల్గొన్నారు.