
ప్రశాంతంగా నీట్ పరీక్ష
అనంతగిరి: వికారాబాద్‌లో నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర, జెడ్పీహెచ్‌ఎస్ బాలికల, సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల, కొత్తగడిలోని బాలికల గురుకుల, అనంతగిరిపల్లి సమీపంలోని బాలుర గురుకుల పాఠశాల సెంటర్లలో నిర్వహించారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ఉండగా 11 గంటల నుంచే సెంటర్లలోకి అనుమతించారు. 1.30 గంటలకు గేట్ మూసివేశారు. మొత్తం 1193 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 39 మంది గైర్హాజరయ్యారు. 1154 మంది పరీక్ష రాశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే హాల్‌లోకి పంపించారు. పరీక్షకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా సెంటర్‌లను జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్‌డీఓ వాసుచంద్ర తనిఖీ చేసి పరీక్ష నిర్వహణపై ఆరా తీశారు.
కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ప్రశాంతంగా నీట్ పరీక్ష

ప్రశాంతంగా నీట్ పరీక్ష

ప్రశాంతంగా నీట్ పరీక్ష

ప్రశాంతంగా నీట్ పరీక్ష