
ఆపదలో ఉన్నవారికి ‘ఆర్ట్’ చేయూత
మహేశ్వరం: ఆపదలో ఉన్నవారిని అదుకునేందుకు తమ సంస్థ పనిచేస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్, ఆర్ట్(అనితారెడ్డి తీగల) ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ తీగల అనితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గొల్లూరులో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఆమె, రోగులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిత్యం కొంత సమయాన్ని వాకింగ్, ధ్యానం, యోగాకు కేటాయించాలన్నారు. ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి హాజరైన సుమారు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, మాజీ సర్పంచ్ హరినాథ్‌గౌడ్, నాయకులు బాల్‌రాజ్, లోకేశ్వర్‌రెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.