
ప్రాణం తీసిన చేపల వేట
తాండూరు రూరల్: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ గిరిజనుడు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ ఘటన మండల పరిధిలోని మైసమ్మతండాలో శనివారం చోటుచేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. తండాకు చెందిన రాథోడ్ శాంతుకుమార్(28), లక్ష్మీబాయి దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. శాంతుకుమార్ మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య లక్ష్మి కూలీ పనులకు వెళ్తుంది. శుక్రవారం పెద్దేముల్ మండలం పాషాపూర్‌లో జరిగిన ఓ విందులో పాల్గొని ఇంటికి వచ్చిన శాంతు సాయంత్రం 6గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తండా మొత్తం వెతికారు. శనివారం ఉదయం గుండ్లమడుగుతండాకు చెందిన జయరాంచౌహన్‌కు తండా సమీపంలోని ఐలాన్‌చెరువు వద్ద శాంతు బైక్, దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే అతను ఈ విషయాన్ని మైసమ్మతండా వాసులకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వచ్చి చెరువులో గాలించగా శాంతు మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. శాంతుకుమార్ మృతితో భార్య, పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
చెరువులో మునిగి గిరిజనుడి మృతి
మైసమ్మతండాలో విషాదం

ప్రాణం తీసిన చేపల వేట