చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
తుక్కుగూడ: ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే చిన్నారులకు ప్రభుత్వాలు పంపిణీ చేసే పౌష్టికాహారం అందించాలని కేంద్ర మహిళ సంక్షేమ శాఖ జాయింట్ సెకట్రరీలు డాక్టర్ ప్రీతం, యశ్వంత్ అన్నారు. పురపాలక కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారుల వ్యక్తిగత వివరాలు, అందుతున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆట పాటలతో చిత్రాలను ఉపయోగించి చిన్నారులకు బోధన చేయాలని, పిల్లల మేధో వికాసం పెంపొదించే విధంగా బోధన ఉండాలన్నారు. వారి మానసిక, శారీరక ఎదుగుదలను ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించారు.


