తెల్ల కుసుమ నూనె ఆరోగ్యానికి మంచిది. రెండేళ్లుగా సాగు చేస్తున్న. గ్రామంలో చాలామంది రైతులు ఈ పంటలనే సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. తెల్ల కుసుమలను గానుగ ఆడించి నిల్వ చేసిన నూనెను ఏడాది పొడవునా వినియోగిస్తాం. బంధువులకు పంపిస్తుంటాం. 15 లీటర్ల డబ్బాను రూ.5 వేలకు విక్రయిస్తున్నాం.
– పర్వేద మల్లేశ్, రైతు, బొబ్బిలిగామ
కల్తీ నూనెతో అనారోగ్యం
మార్కెట్లో ఎక్కువగా కల్తీ నూనె లభిస్తోంది. దీనిని వాడిన ప్రజలు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఆరోగ్యానికి తెల్ల కుసుమ, నల్ల కుసుమ, నువ్వులు, పల్లి నూనె మంచిది. రైతులు నూనె గింజల సాగు చేసి, ఇంటి నూనె వినియోగించుకోవాలి. ప్రజలు ఎక్కువగా తెల్ల కుసుమ నూనె కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల పాటు కుసుమ నూనె పట్టిస్తారు.
– గోవుల అంజయ్య, రైతు, మక్తగూడ
సాగు విస్తీర్ణం పెరిగింది
ఈ యాసంగిలో నూనె గింజల పంటలు తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు, వేరు శనగ సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో అందరూ జొన్న, మొక్కజొన్న పంటలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. కాగా నియంత్రిత సాగు వ్యవసాయ విధానం నుంచి మొక్కజొన్న పంటలు వేసే రైతులు.. ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి లాభసాటికానున్నాయి.
– వెంకటేశం, ఏఓ, షాబాద్
●
తెల్ల కుసుమ సాగు చేస్తున్నాం