అనంతగిరి: అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీ య విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేయకుండా ఆపాలన్నారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ పర్మినెంట్ చేయాలన్నారు. మినీ అంగన్‌వాడీ టీచర్లకు పది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలన్నారు. రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్ కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, కార్యదర్శి భారతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు వనజ, మంజుల, భారతి, ప్రమీల, సత్యమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ