
సర్వేకు సహకరించాలి
సర్వేలో ప్రధానంగా శరీర భాగాలపై ఉండే తెల్ల, నల్ల మచ్చలతో పాటు ఇతర రకాల చారలు ఉన్నవారిని గుర్తిస్తారు. మచ్చలు ఉన్న చోట స్పర్శ లేకపోవటం లాంటి లక్షణాల ద్వారా లెప్రసీ రోగులను నిర్ధారిస్తారు. వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీకి వివరాలు అందజేస్తారు. రోగ నిర్ధారణ తరువాత వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే చికిత్స చేయిస్తుంది. ఈ క్రమంలో రోగులను గుర్తించటమే ప్రధాన అంశం. అందుకే సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇంటికి వచ్చిన ఆరోగ్య సిబ్బందికి అవసరమైన వివరాలు అందజేయాలి.
– డాక్టర్ రవీందర్ యాదవ్, జిల్లా లెప్రసీ నిర్మూలన అధికారి