యాలాల: తాండూరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి రూ.68 కోట్లతో అగ్గనూరు నుంచి బషీరాబాద్ మండలం వరకు చేప్టటనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే యాలాల మండలంలోని కమాల్‌పూర్ నుంచి రాస్నం వరకు రోడ్డు విస్తరణ పనులను చురుగ్గా సాగుతున్నాయన్నారు. అగ్గనూరు నుంచి బషీరాబాద్ వరకు రోడ్డు విస్తరణ పనులు సైతం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు భీమయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ సర్పంచ్ భీమప్ప, నాయకులు హన్మంతు, ఖాసీం, రఘురాంరెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, ప్రశాంత్, ఎల్లప్ప, సత్యనారాయణ, రఘు తదితరులు ఉన్నారు.
బషీరాబాద్: మండల పరిధిలో రూ.106 కోట్లతో బషీరాబాద్ మైల్వార్ రోడ్డుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
రహదారుల అభివృద్ధికి పెద్దపీట