చేవెళ్ల: మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం పడి తాగునీరు వృథాగాపోవడంతో పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపల్లి సమీపంలో బుధవారం కేబుల్ వైర్ల కోసం జేసీబీతో కాల్వ తీస్తుండగా భగీరథ ప్రధాన పైప్‌లైన్‌కు తగిలింది. దీంతో పైల్‌లైన్ ధ్వంసమై నీళ్లు ఎగిసిపడ్డాయి. రహదారి మొత్తాన్ని ఆక్రమించి వెదజిమ్మిన నీటితో ఈ రూట్‌లో రాకపోకలు సాగించిన ద్విచక్రవాహనదారులు తడిసి ముద్దయ్యారు. నీటి వృథాతో ఈప్రాంతమంతా బుదరదమయమైంది. కొద్దిసేపటి తర్వాత మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందడంతో సరఫరాను నిలిపేశారు.
భగీరథ.. నీటివృథా!