పరిగి: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ, జాతీయ కార్యదర్శి హన్మంతుముదిరాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వం కులగణన, విద్యార్థులకు స్కాలర్ షిప్, మెస్ చార్జీలు పెంచడంతో బుధవారం పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, బీసీ కులగణన చేపడుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. విద్యార్థులకు చాలీచాలని మెస్ చార్జీలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించిందన్నారు. ప్రభుత్వం కులగణన చేపట్టడంతో రాష్ట్రంలోని బీసీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాజకీయంగా అన్ని విధాల వెనుకబడిన వర్గాలకు లాభం చేకూరుతుందన్నారు. బీసీలకు 42శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేందుకు కులగణనను ప్రభుత్వం చేపడుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, డీసీసీ ఉపాధ్యక్షుడు అశోక్, నాయకులు నరసింహ పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం
రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ


