విపత్తులపై మాక్ ఎక్సర్ సైజ్
అనంతగిరి: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ నెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమం నిర్వహించనున్న ట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధం కావాలని సూచించారు. శుక్రవారం నగరంలోని టీజీఐసీసీసీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్‌డీఎంఏ మేనేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ హసనైన్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..వరదలు, పరిశ్రమల్లో ప్రమాదాలు,విపత్తులు సంభవించిన సమ యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మాక్ ఎక్సర్ సైజ్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అడిషనల్ ఎస్పీ రామునాయక్, ఆర్‌డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
23న ‘మీ డబ్బు.. మీ హక్కు’
మీ డబ్బు.. మీ హక్కు అనే అంశంపై ఈ నెల 23న ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. కలెక్టరేట్‌లో ఈ నెల 23వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నాణ్యత తప్పనసరి
జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన పనులను అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో సుధీర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమావేశ మందిరం, చైర్మన్, సీఈఓ ఛాంబర్లు, వివిధ నిర్మాణాలను పరిశీలించారు. జెడ్పీ ఆవరణ పచ్చదనంతో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఈఈ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


