సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

Dec 21 2025 7:02 AM | Updated on Dec 21 2025 7:02 AM

సీఎంన

సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

పరిగి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో 206 స్థానాలకు గాను 137 జీపీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందడంపై సీఎం అఽభినందించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి సూచించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

తపస్‌ జిల్లా అధ్యక్షుడిగా

సంగమేశ్వర్‌

అనంతగిరి: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) జిల్లా నూతన అధ్యక్షుడిగా వికారాబాద్‌కు చెందిన కూర సంగమేశ్వర్‌, ప్రధాన కార్యదర్శిగా గాజుల బస్వరాజు ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. శుక్రవారం పట్టణంలోని స్వాగత్‌ కన్వెన్షన్‌లో తపస్‌ జిల్లా ముఖ్య ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బాకారం మల్లయ్య, కోశాధికారిగా గొల్ల రమేష్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంగమేశ్వర్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమ స్యలపై పోరాటం చేస్తామన్నారు. తన ఎన్నికకు సహకరించి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు జనార్దన్‌రెడ్డి, చంద్రమౌళి, అనంత్‌రెడ్డి, హనుమప్ప, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈకేవైసీ చేయించుకోండి

కొడంగల్‌: రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సివిల్‌ సప్లయ్‌ అధికారులు సూచించారు. లబ్ధిదారులు రేషన్‌ దుకాణాలకు వెళ్లి బయో మెట్రిక్‌ విధానంలో వేలి ముద్రలు పెట్టాల్సి ఉంటుందన్నారు. కొడంగల్‌ మండలంలో 746 అంత్యోదయ కార్డులు, 14,618 ఆహార భద్రత కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు కార్డుల ద్వారా 55,179 మంది బియ్యాన్ని తీసుకుంటున్నారని అన్నారు. అందులో 32,921 మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారు వేలి ముద్రలు వేయాలని కోరారు.

పెండింగ్‌ బిల్లులు

వెంటనే విడుదల చేయాలి

అనంతగిరి: వైద్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల పెండింగ్‌(లెప్రసీ సర్వే, పల్స్‌ పోలి యా) బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారిగా చంద్రయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ఆశా వర్కర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మంగమ్మ, మాధవి, పద్మ, అనురాధ, అరుణ, కౌసల్య, జగదేవి, మునిబాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ 
1
1/2

సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ 
2
2/2

సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement