ముగిసిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

● 99 శాతం హాజరు

తిరుపతి సిటీ : జిల్లాలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌–1 నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు పేపర్‌–2 జరిగింది. మొత్తం రెండు కేంద్రాల్లో చేపట్టిన పరీక్షలకు 99శాతం హాజరు నమోదు కావడం విశేషం.

సివిల్స్‌ను తలపించేలా ఫిజిక్స్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఫిజిక్స్‌ ప్రశ్నల సరళి సివిల్స్‌ పరీక్షలను తలపించేలా క్లిష్టతరంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. మ్యాథ్స్‌ కాలిక్యులేషన్స్‌లో తక్కువగా ప్రశ్నలు వచ్చాయని, మోడరేట్‌గా ఉన్నాయని, అలాగే కెమిస్ట్రీ పేపర్‌–1 చాలా సులువుగా ఉందని, పేపర్‌–2లో మాత్రం క్లిష్టమైన ప్రశ్నలు వచ్చాయని అధ్యాపకులు విశ్లేషించారు.

పేపర్‌–2 క్లిష్టమనిపించింది

అడ్వాన్స్‌డ్‌ పేపర్‌–1లో కాస్త సులువుగా ప్రశ్నలు వచ్చాయి. పేపర్‌–2 మాత్రం కొంత క్లిష్టంగా అనిపించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రశ్నపత్రం కష్టమని చెప్పవచ్చు. కెమిస్ట్రీ కొంత ఇబ్బంది పెట్టినా పరీక్ష బాగానే రాశా. – కె.లావణ్య, విద్యార్థిని, తిరుపతి

ఫిజిక్స్‌లో ప్రశ్నలు కఠినం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఫిజిక్స్‌ ప్రశ్నలు కఠినంగా ఇచ్చారు. పేపర్‌–1, పేపర్‌–2లోనూ కష్టతరంగానే వచ్చాయి. మ్యాథ్స్‌లో ఆల్జీబ్రా, ప్రోపర్టీస్‌పై అధికంగా ప్రశ్నలు సంధించారు. న్యూమరికల్‌ క్వశ్చన్స్‌ కొంత టఫ్‌గా అనిపించాయి.

– బి.రాజశ్వనిక్‌, విద్యార్థి, తిరుపతి

మోడరేట్‌గా ఉంది

అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలు మోడరేట్‌గా అనిపించాయి. ఫిజిక్స్‌లో మాత్రం కాస్త కఠినంగా వచ్చాయి. మ్యాథ్స్‌లోని ఆల్జీబ్రా విభాగంలో ప్రశ్నలు కష్టతరంగా వచ్చాయి. కెమిస్ట్రీ రెండు పేపర్లలోనూ మాదిరిగా ప్రశ్నలు అడిగారు. – సుప్రియ, విద్యార్థిని, తిరుపతి

ఒత్తిడికి గురయ్యారు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నపత్రం చాలా లోతుగా కాన్సెప్ట్‌ ఆధారితంగా ఉంది. ప్రశ్నలను నిశితంగా పరిశీలించేందుకు సమయం ఎక్కువగా తీసుకోవడం విద్యార్థులు కాస్త ఒత్తిడికి గురిచేసింది.ఎన్‌సీఈఆర్‌టీ స్థాయిలో సుదీర్ఘ కాలం శ్రమించిన విద్యార్థి మంచి స్కోర్‌ చేసే అవకాశముంది. – వి.అశోక్‌ కుమార్‌, జేఈఈ నిపుణుడు, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement