ఎర్రచందనం దుంగల పరిశీలన
కలువాయి(సైదాపురం): ప్రభుత్వ అనుమతితో నరికి, విక్రయించేందుకు ఓ ప్రైవేట్ సంస్థలో ఉంచిన ఎర్రచందనం దుంగలను జిల్లా అటవీశాఖాధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారి మాల్యాద్రి శుక్రవారం పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ మొత్తం ఐదు ఎర్రచందనం చెట్లు నరకగా వచ్చిన నాలుగు టన్నుల బరువున్న 39 దుంగలు, నాలుగు వేర్లు 970 కిలోలు ఉన్నట్లు తెలిపారు. వీటి కొలతలు, బరువు పరిశీలించిన అనంతరం సంబంధిత వారికి పర్మిట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు స్క్వాడ్ రేంజర్ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


