పట్టా భూమిగా మార్చి.. ఏమార్చి!
● దర్జాగా కబ్జా
ఏర్పేడు: ‘అది ప్రభుత్వ భూమి... అయితే దాన్ని ఆక్రమించుకున్న ఓ వ్యక్తి రెవెన్యూ అధికారుల అండదండలతో సెటిల్మెంట్ భూమిగా వేరొక సర్వే నంబర్‌తో మార్చుకుని దర్జాగా అనుభవిస్తున్నాడు. ఏర్పేడు–వెంకటగిరి మార్గం చింతలపాళెం రెవెన్యూ పరిధిలో రోడ్డు పక్కన సర్వే నంబర్ 46–14లో 39 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమిని కాజేసిన వ్యక్తి కొన్నేళ్ల కిందట దీనిని స్వానుభవం సెటిల్మెంట్ పట్టా భూమిగా మార్చారు. రెవెన్యూ అధికారులు ఏకంగా సర్వే నంబర్‌ను 46–20 పేరుతో కొత్త నంబర్ సృష్టించి 73 ఖాతా నంబర్‌తో ఆన్‌లైన్‌లో సొంత భూమిగా నమోదు చేశారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించి సాగుచేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏర్పేడు తహసీల్దార్ ఎం.భార్గవిని వివరణ కోరగా విచారించి, ప్రభుత్వ భూమి అని తేలితే తగు చర్యలు తీసుకుంటామన్నారు.


