ఐఐటీలో హోరాహోరీగా క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఐఐటీలో హోరాహోరీగా క్రీడా పోటీలు

Dec 17 2025 6:40 AM | Updated on Dec 17 2025 6:40 AM

ఐఐటీలో హోరాహోరీగా క్రీడా పోటీలు

ఐఐటీలో హోరాహోరీగా క్రీడా పోటీలు

ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో జరుగుతున్న 58వ ఇంటర్‌ ఐఐటీ స్పోర్ట్స్‌ మీట్‌లో మూడో రోజు మంగళవారం చెస్‌, టెన్నిస్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ క్రీడా సంబరం డిసెంబర్‌ 14 నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది.

క్రీడల పోటీలలో నువ్వా..నేనా..?

చెస్‌ పోటీలో ఐఐటీ కాన్పూర్‌ అద్భుతంగా ఆడి, 8 పాయింట్లతో టేబుల్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ 7.5 పాయింట్లతో కాన్పూర్‌కు దగ్గరగా ఉంది. ఐఐటీ బీహెచ్‌యూ వారణాసి, ఐఐటీ హైదరాబాద్‌ చెరో 6 పాయింట్లతో మూడో స్థానంలో సమానంగా ఉన్నాయి. టెన్సిస్‌లోనూ వివిధ జట్లు నాక్‌అవుట్‌కు చేరుకోవటానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాగా వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రూర్కీ , కాన్పూర్‌, బీహెచ్‌యూ వారణాసి జట్లు లీగ్‌ మ్యాచ్‌ల్లో సత్తా చాటి ముందంజలో ఉన్నాయి. ఫస్ట్‌ జనరేషన్‌ ఐఐటీ మద్రాస్‌, 2వ జనరేషన్‌ ఐఐటీ హైదరాబాద్‌లో కూడా ఈ స్పోర్ట్స్‌ మీట్‌ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement