సీకాం కళాశాలకు అరుదైన గౌరవం
తిరుపతి సిటీ: ఢిల్లీ వేదికగా విజయ్ వివస్ సందర్భంగా వెటరన్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్–2025 కార్యక్రమంలో తిరుపతి సీకాం డిగ్రీ కళాశాలకు హానర్స్ ఆఫ్ పార్టిఫికేషన్ కళాశాల అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి సంజయ్‌సేథ్, అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్, వెటరన్స్ ఇండియా వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ బీకే మిశ్రా చేతుల మీదుగా సీకాం కళాశాలల డైరెక్టర్ టీ.ప్రణీత్ స్వరూప్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీకాం కళాశాల నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా సేవలందిస్తోందన్నారు. దీంతో ఇప్పటికే కళాశాల ప్రత్యేక హోదా సాధించిందన్నారు. దేశభక్తి, సేవారంగాలల్లో సైతం కళాశాల ముందంజలో ఉందని చెప్పారు.


