కోట ఎంపీపీ అంజమ్మ మృతి
కోట: స్థానిక ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ నాయకురాలు దాసరి అంజమ్మ(60) మంగళవారం మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమె పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనుంజయరెడ్డికి ముఖ్య అనుచరులుగా గుర్తింపు పొందారు. ఊనుగుంటపాళెం ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆమె అనంతరం కోట ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఊనుగుంటపాళెంలో ఆమె మృతదేహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనుంజయరెడ్డి, సీఈసీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ పలగాటి సంపత్‌కుమార్ రెడ్డి, తహసీల్దార్ జయజయరావు, ఎంపీడీఓ దిలీప్‌కుమార్‌లు నివాళులర్పించారు. జనసందోహం మధ్య ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.
కోట ఎంపీపీ అంజమ్మ మృతి


