అపహరణల పర్వానికి తెరతీసిన టీడీపీ
్ఠవాకాడు: కూటమి నేతల మాట వినని వారిని హించించడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టి కిడ్నాప్ చేసే స్థాయికి బాబు ప్రభుత్వం దిగజారిందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన వాకాడులోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. వాకాడు బీసీ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, నేదురుమల్లి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సయ్యద్ నజీర్ బాషా అనే వృద్ధుడిని గురువారం రాత్రి బాబు ప్రభుత్వం అండదండలతో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి భయపెట్టి అపహరించుకుపోయారన్నారు. నజీర్‌బాషా కుమార్తె ఫామిదా నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్‌గా కొనసాగుతుందన్నారు. ఈమె గతంలో వైఎస్సార్‌సీపీలో ఉంటూ టీడీపీలో చేరి, విసిగి వేశారిపోయిందన్నారు. తమ తప్పులు తెలుసుకున్న ఫామిదాతోపాటు నలుగురు కౌన్సిలర్లు తాడేపల్లిలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి పార్టీలో చేరారన్నారు. దీంతో నజీర్‌బాషాతోపాటు నెల్లూరులో మరో నలుగురు కార్పొరేటర్ల బంధువులను అపహరించినట్లు తెలిసిందన్నారు. తమ కార్యకర్త నజీర్ అపహరణపై వాకాడు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. వృద్ధుడైన నజీర్‌కి ఏమైనా జరిగితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. నజీర్‌ను తీసుకొచ్చి వారి బంధువులకు అప్పజెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు, కోట మండలాల కన్వీనర్లు సుధాకర్‌నాయుడు, సంపత్‌కుమార్‌రెడ్డి, నాయకులు నాగూర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, పెంచలరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శేషురెడ్డి, వెంకటయ్య, పెంచలయ్య, మోహన్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.


