జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు గునపాడు పీడ
చిట్టమూరు: మండలంలోని గునపాడు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న పిడుగు భరత్ మహీపతి జాతీయ స్థాయిలో జరిగే మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఓఈ–2 భూపయ్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో హ్యామర్‌త్రో విభాగంలో బంగారు పతకం, డిస్కస్‌త్రోలో వెండి పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొ న్నారు. 2026 జనవరిలో కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ బీవీ కృష్ణయ్య, పాఠశాల ఉపాధ్యాయులు సీతారామయ్య, పెంచలయ్య, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, రేణుక, వరలక్ష్మి, శ్రీనివాసులు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.


