సంతకం..
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తిరుగుబాటు తిరుపతి జిల్లాలో 4.54 లక్షలు.. చిత్తూరు జిల్లాలో 3.81 లక్షలు 13 వరకు కొనసాగనున్న కోటి సంతకాల సేకరణ అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కోటి సంతకాలకు అనూహ్య స్పందన
తిరుపతి నియోజకవర్గంలో భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లా ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ శిరీష ప్రత్యక్షంగా ఈ పక్రియలో పాల్గొని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో 60 వేల సంతకాలను సేకరించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో 73 వేల మంది నుంచి సంతకాలు సేకరించారు.
గూడూరు నియోజకవర్గంలో సమన్వయకర్త మేరిగ మురళి ఆధ్వర్యంలో 80 వేల మంది నుంచి సంతకాలు సేకరించారు.
వెంకటగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రాంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 58 వేల మంది నుంచి సంతకాలు సేకరించారు.
సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో 50 వేల మంది నుంచి సంకాలు సేకరించారు.
సత్యవేడులో నియోజక వర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో 25 వేల మంది నుంచి సంతకాల సేకరణ జరిగింది.
ఇలా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.54 లక్షల మంది నుంచి సంతకాలు సేకరించారు. ఈ సంతకాల సేకరణ ఇంకా కొనసాగుతోంది.
సిరా చుక్కలు సంతకాల రూపం ధరిస్తున్నాయి.. అక్షర ఆయుధాలుగా మారుతున్నాయి. ఆ సంతకాలే సమరశంఖారావం పూరిస్తున్నాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాయి. సర్కారుపై దండెత్తుతున్నాయి.. వైద్య విద్యను బాబు ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తున్నాయి. చిన్న ఉద్యమంగా మొదలై మహోద్యమంగా అవతరిస్తున్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల యాగంలో పాలుపంచుకోవడానికి ఊరూవాడా సిద్ధమవుతున్నాయి. తమ పిల్లలపై ప్రైవేటు పెత్తనం వద్దంటూ సామాన్య, మధ్యతరగతి జనం స్వచ్ఛందంగా సంతకం చేసి, తమ నిరసనను వెలిబుచ్చుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం.. మహాద్యమంలా సాగు తోంది. పార్టీలకతీతంగా విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతుండడంతో తిరుపతి, చిత్తూరు, జిల్లాల్లో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రా ష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్ కళాశాలలు 2023–2024 మధ్య కాలంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆ ఐదు కళాశాలల ద్వారానే అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు వచ్చేలా చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో మెడికల్ కళాశాలలన్నింటినీ కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. మెడికల్ కళాశాలలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగుతోంది.
ఉద్యమం.. మహోద్యమం!
ఉద్యమం సాగుతోందిలా..
సంతకం..
సంతకం..


