తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తిరుమల : మతిస్థిమితం లేని వ్యక్తి గొంతు, కడుపు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమ ల టూటౌన్ సీఐ శ్రీరాముడు కథనం మేరకు.. కొంతకాలంగా తిరుమలలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తి అకస్మాత్తుగా బటన్ నైఫ్‌తో తనను తానే తీవ్రంగా గాయపర్చుకుని ఆర్బీ సెంటర్ వద్ద పడిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్‌లో అతడిని టీటీడీ అశ్విని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.


