రెండు బైక్‌ల ఢీ.. ఇద్దరికి గాయాలు
తిరుమల : తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే దారిలోని అలిపిరి చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనదారులు ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.
మోటార్‌సైకిల్ ఢీకొని
వ్యక్తి దుర్మరణం
సూళ్లూరుపేట : పట్టణంలోని శేషసాయి కల్యాణమండపం ఎదుట మోటార్ సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. సూళ్లూరుపేట మండలం మన్నేముత్తేరి పంచాయతీ గంపలకండ్రిగకు చెందిన పల్లికొండ పుల్లయ్య (45) బుధవారం రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మరణించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ కేసు నమోదు
చిల్లకూరు : మండలంలోని అన్నంబాక గ్రామానికి చెందిన తిరుమల చెంచమ్మ అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాలు.. చెంచమ్మ ఇటీవల చైన్నెలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువాను దుండగులు పగులగొట్టి బంగారు నగలు అపహరించినట్లు గుర్తించింది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


