
ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!
పుంగనూరు : పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలు మాయం చేశారంటూ దాత అని చెబుతున్న ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. వివరాలిలా ఉ న్నాయి.పుంగనూరు మండలంలోని ఉలవలదిన్నెకి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి తన తల్లి కోరిక మే రకు 352 గ్రాముల బంగారు నగలను 2008లో శ్రీవారికి విరాళంగా ఇచ్చినట్లు, ఆ నగలను అప్పటి ఈవో, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ ఏకాంబరంకు అందజేయగా, తనకు ఆ సమయంలో రశీదు ఇచ్చారని ఆరోపించారు. ఆ నగలు ప్రస్తుతం గరుడసేవలో వినియో గించకపోవడంతో ప్రస్తుతం పుంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి టీటీడీ ఆధీనంలో ఉంది. దీంతో టీ టీడీ వారిని ఆర్‌టీఐ ద్వారా వివరణ కోరగా అలాంటి ఆభరణాలు టీటీడీ వద్ద లేవని తెలిపినట్లు దాత ఆది నారాయణ తెలిపారు. తన నగలు మాయం చేసిన ఈఓ, ఇప్పటి డీసీ ఏకాంబరంపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై డిప్యూటీ క మిషనర్ ఏకాంబరం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ ఆదినారాయణ ఎలాంటి నగలు విరాళంగా స్వామివారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నకిలీ రశీదు సృష్టించి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చ ర్యలు తీసుకో వాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
21పిజిఆర్ 04 : పుంగనూరులో నగలు మాయం చేశారని ఆరోపిస్తున్న ఆదినారాయణ
21పిజిఆర్ 05 : నగలు ఇవ్వలేదని తెలుపుతున్న డీసీ ఏకాంబరం

ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!