
పిడుగు పాటుకు ఇల్లు దగ్ధం
చిల్లకూరు: వర్షాల కారణంగా సోమవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఓ ఇల్లు కాలిపోయిన సంఘటన మండలంలోని లింగవరం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. లింగవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఆదివారం నెల్లూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. వర్షాలు భారీగా కురుస్తుండడంతో ఆమె అక్కడే ఉండి పోయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఇంటితోపాటు అందులోని ఎలక్ట్రికల్ వస్తువులు పూర్తిగా కాలి పోయాయి. స్థానికులు ఆమెకు మంగళవారం సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లో వస్తువులు ఏమి మిగలకపోవడంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు.