
శాస్త్రోక్తంగా కేదారీగౌరీదేవి వ్రతం
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కేదారీగౌరీదేవి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి ముందు కలశస్థాపన చేసి కేదారీగౌరీదేవి వ్రతం జరిపారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కేదారీగౌరీదేవి వ్రతం సందర్భంగా నోములు నోచుకున్నారు. నోముదారాలు స్వీకరించారు. అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయంలో రద్దీ పెరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా కేదారీగౌరీదేవి వ్రతం