
రైతులను క్షోభ పెట్టడం మంచిది కాదు
పాకాల : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారని.. సీఎంగా చంద్రబాబునాయుడు ఎక్కిన రోజు నుంచి వ్యవసాయానికి గ్రహణం పట్టిందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఇంత క్షోభ పెట్టడం మంచి కాదని రైతులు ఆరోపించారు. పాకాల మండలం దామలచెరువు మన గ్రోమోర్ సెంటర్ వద్ద మండుటెండలోనే రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం సాగు చేసే పంటలకు యూరియా అవసరమని.. గంటల తరబడి క్యూలో నిలుచుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం ఏఓ హరితకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం 230 బ్యాగులు (12.2 టన్నుల) యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు ఒక బ్యాగు (40కేజీలు) చొప్పున అందించామని తెలిపారు. క్యూలైన్లో ఉన్న రైతులకు టోకెన్లు జారీ చేసి సాయంత్రం వరకు యూరియా సరఫరా చేశామని వివరించారు.