
15మంది స్మగ్లర్ల అరెస్ట్
తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 15 మంది స్మగ్లర్లతో పాటు 15 ఎర్రచందనం దుంగలను గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి స్మగ్లింగ్‌కు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. అన్నమయ్య జిల్లా సానిపాయ, వీరబల్లి ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధ వారం కూంబింగ్ చేపట్టారు. అప్పయ్యగారిపల్లి అటవీ ప్రాంతంలో వద్ద రెండు కార్లు కనిపించాయి. వాటిని సమీపించడంతో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను కార్లలోకి లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టగా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి 15 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేయగా 15 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో సహా పట్టుబడిన వారిని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించగా డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.