
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 19 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,828 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.07 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేనివారికి 19 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
శ్రీకాళహస్తి: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం 69వ ఉమ్మడి చిత్తూరు జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. జిల్లాస్థాయి క్రీడాకారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు తీగల వెంకటయ్య, ఎంఈఓలు బాలయ్య, భువనేశ్వరమ్మ, కిషోర్ పాల్గొన్నారు.
ఐసీడీఎస్‌లో ఉద్యోగాలు
తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ పరిధిలోని మిషన్ వాత్సల్య స్కీమ్‌కు సంబందించి డీసీపీయూ,ఎస్‌ఏఏ యూనిట్ పరిధిలో ఖాళీ పోస్టులకు దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీడీ వసంతబాయి బుధవారం తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తులను పోస్టల్ ద్వారా లేదా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు. ఎంపికై న వారికి రూ.7,944 నుంచి రూ.10వేల వరకు నెలవారీ వేతనం ఉంటుందని వివరించారు. ఓసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలని తెలిపారు. తిరుపతి.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉన్నట్లు వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం
తిరుపతి మంగళం : ౖవెఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన కేతం జయచంద్రారెడ్డి(తిరుపతి), ఆరె. అజయ్‌కుమార్(తిరుపతి), కేవీ భాస్కర్‌నాయుడు(సత్యవేడు), టి. హరిచంద్రన్ (సత్యవేడు), కేవీ నిరంజన్‌రెడ్డి(సత్యవేడు)ని నియమిస్తున్నట్లు పేర్కొంది.
రేపటి నుంచి
జాతీయ స్థాయి నృత్య పోటీలు
తిరుపతి కల్చరల్ : రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవాల్లో భాగంగా నేటి నుంచి మహతి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్‌రెడ్డి, గౌరవ సలహాదారు కీర్తి వెంకయ్య తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శాసీ్త్రయ, జానపద నృత్య పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే నాట్య గురువులు, నృత్య కళాపోషకులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రంగస్థలి కార్యదర్శి కేఎన్.రాజా, కళాకారులు జేజీరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, మస్తాన్, రవిప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు