
కక్ష సాధింపులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
రాష్ట్రంలో పరిస్థితులు దారణంగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు వస్తే తమకు మింగుడుపడని పక్షంలో ఖండించాలి తప్ప కక్ష సాఽధింపు చర్యలకు దిగడంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు బనాయించి నోటీసులు జారీచేయడం మేధావి వర్గాలు, జర్నలిస్టులు ఆలోచించాల్సిన విషయం. వ్యవస్థలను తమ చేతులోకి తీసుకుని ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తే అందుకు తగిన మూల్యం భారీ స్థాయిలో చెల్లించుకోక తప్పదు. ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనబడలేదు. ఇకనైనా పత్రికల యాజమాన్యాలపైన, జర్నలిస్టులపైనా కేసులు పెట్టే సంస్కృతి మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ దృష్టి సారించాలి