
శ్రీకాళహస్తిలో పోలీసుల ఆంక్షలు
శ్రీకాళహస్తి: వైఎస్సార్‌సీపీ రైతు పోరుబాట సందర్భంగా మంగళవారం ఉదయమే వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లకూడదని 30 యాక్టు అమల్లో ఉందని పోలీసులు హడావుడి చేశారు. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు పోలీసుల అనుమతి కోరారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి అందరినీ పిలిచిన తరువాత రాత్రి 9 గంటలకు పోలీసులు తీరిగ్గా ర్యాలీ నిర్వహించకూడదని నేరుగా ఆర్డీవో కార్యాలయానికి రావాలని అనేక ఆంక్షలు పెట్టారు. రెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన జనం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి లేదని ఆటంకాలు కల్పించారు. అత్యధిక సంఖ్యలో వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు, రైతులు కిలోమీటరు దూరం కూడా లేని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లడానికి అడ్డువపడ్డారు. అడుగడుగునా పోలీసులు డ్రోన్లు, కెమెరాలు, ఫోన్లలో వైఎస్సార్‌పీ నాయకులను ఫొటోలు, వీడియోలో తీస్తూ ఇబ్బందులకు గురిచేశారు. స్థానిక టీడీపీ నాయకులకు వాటిని చేరవేశారు.