
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తాం
రాపూరు : రాష్ట్రంలోని ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు అన్నారు. రాపూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉత్తమ ఉద్యోగుల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీ లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కార్గో సర్వీసులో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్ధానంలో ఉందన్నారు. కార్గో సర్వీసును ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. బస్సుల్లో 100 మంది కంటే ఎక్కువ మందిని ఎక్కించవద్దని ఆదేశించారు. రాష్ట్రానికి కొత్తగా ఎలక్టికల్ బస్సులు రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1050 బస్సులు ఉన్నాయని మరో 300 బస్సులు వస్తాయని, అవికాక మరో 1500 బస్సులు అవసరమని ఆయన చెప్పారు. బస్సులు ఎక్కడా ఆగకుండా కొత్త టైర్లు, అవసరమైన సామాగ్రిని అందించాలని మెకానిక్‌లు బస్సును కండీషన్‌లో పంపాలని సూచించారు, అనంతరం రాపూరు ఆర్టీసీ డిపోలో అత్యధికంగా మైలేజ్ తీసుకొచ్చిన డ్రైవరు నరసింహులు, కరిముల్లాను , కండక్లర్లు వెంకటేశ్వర్లు, సంపూర్ణను అభినందించి నగదు , ప్రశంసా పత్రాలను అందించారు. అలాగే మెకానిక్ సుధాకర్, చాన్‌భాషా, ఆర్టీసీ ఆఫీస్ సిబ్బంది రహీం, హరిబాబుకు ప్రసంసాపత్రాలు , నగదును అందించారు.అనంతరం ఆర్టీసీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సురేష్‌రెడ్డి, ఈడీ నాగేంద్రప్రసాద్, ఆర్‌ఎం షమీం, డీఎం అనిల్‌కుమార్, ఆర్టీసీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.