తిరుపతి సిటీ : పీజీసెట్–2025 కౌన్సిలింగ్ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. దీంతో జిల్లాలోని అన్ని నెట్ సెంటర్ల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసినా వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి అధికారుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. జిల్లాలో పీజీ అడ్మిషన్లకు సంబంధించి సోమవారం కనీసం 120 మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ కూడా కాకపోవడం గమనార్హం.
గుండెపోటుతో భక్తుడి మృతి
శ్రీకాళహస్తి : ముక్కంటి ఆలయంలో సోమవారం ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. హైదరాబాద్ కు చెందిన మధుబాబు(52) ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఉపవాసం ఆచరించి సోమవారం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయం నుంచి బయటకు వస్తూ ప్రసాదాల కౌంటర్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.అధికారులు వెంటనే స్పందించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుబాబు మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ గోపి వెల్లడించారు.
శ్రీవారి సేవలో ఆర్మీ అధికారి
తిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం ఆర్మీ లెఫ్టినెంట్ కమాండర్ ధీరజ్‌సేథ్ సేవించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.

గుండెపోటుతో భక్తుడి మృతి