
దొరవారిసత్రం: జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ప్రైవేటు బస్సును ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, టపాయిండ్లు గ్రామానికి చెందిన రమేష్, కల్లూరుకు చెందిన సురేంద్ర ట్రాక్టర్‌ను సర్వీస్ చేసుకునేందుకు సూళ్లూరుపేటకు బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపు తప్పిన ట్రాక్టర్ ముందు వెళుతున్న ప్రైవేట బస్సును ఢీకొని బోల్తా పడింది. దీంతో డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న ప్లాజా అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్‌ఐ అజయ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.