
ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌ఫో
తిరుపతి కల్చరల్ : క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈనెల 5,6,7 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రదర్శించిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో ప్రదర్శన ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు, వివిధ గృహ సుందరీకరణ వస్తువులు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్, రుణ సదుపాయాలు, అధునాతన కార్లు వంటి వాటిని ఒకే వేదికపైకి తెచ్చి సుమారు 60 స్టాల్స్‌తో ప్రజల కలలు సాకారం చేసే దిశగా కృషి చేసిన క్రెడాయ్ ప్రతినిధులను వారు అభినందించారు. అనంతరం క్రెడాయ్ చైర్మన్ గోపినాథ్, అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు తాము ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆదరించి విజయవంతం చేసిన ప్రజలకు, సహకరించిన కంపెనీల ప్రతినిధులకు కృతజ్ఞతులు తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షుడు రాజేష్‌బాబు, కోశాధికారి హరికృష్ణ, సహాయ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.