
శోత్రియ భూముల్లో ఆక్రమణలు చేపడితే జైలే
వరదయ్యపాళెం : మండలంలోని చిన్న పాండూరు పంచాయతీ పాదిరికుప్పం రెవెన్యూలోని శోత్రియ భూముల్లో ఆక్రమణలు చేపట్టడం, దుక్కి దున్నకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మండల తహసీల్దార్ సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కొందరు అక్రమార్కులు కొద్ది రోజులుగా ట్రాక్టర్ల ద్వారా దుక్కి దున్నకాలు చేపడుతున్నారు. దీనిపై శనివారం శోత్రియ భూముల్లో దొంగలు పడ్డారు అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దార్ సుధీర్ రెడ్డి శోత్రియ భూములు సందర్శించి అక్రమంగా చేపట్టిన దుక్కి దున్నకాలను పరిశీలించారు. తక్షణమే శోత్రియ భూముల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై ఎవరైనా దుక్కి దున్నకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అక్రమార్కులను హెచ్చరించారు. స్థానిక వీఆర్వో, వీఆర్‌ఏలను ఈ విషయమై గట్టిగా మందలించి చిన్నపాటి ఆక్రమణలు జరిగినా తన దృష్టికి తక్షణమే తీసుకురావాలని ఆదేశించారు. శోత్రియ భూములపై నిఘా ఉంచాలని సూచించారు. ఆయన వెంట వీఆర్వో చలపతి, విలేజ్ సర్వేయర్ రాఘవ ఉన్నారు.

శోత్రియ భూముల్లో ఆక్రమణలు చేపడితే జైలే