
జాతరకూ గుంతలే రోడ్లే
కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్ వెంకటగిరి జాతరకు లక్షల్లో రానున్న భక్తులు గుంతలమయంగా వెంకటగిరి– గూడూరు రోడ్డు
వెంకటగిరి (సైదాపురం) : రాష్ట్ర పండుగగా జరుగుతున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరకు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు మీదుగా వెంకటగిరికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్న విషయాన్ని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆ శాఖ ఆఽధికారులను రోడ్డు బాగు చేయాలని ఆదేశించారు. జాతర ఆదివారం ఘటోత్సవంతో ప్రారంభమై మరో మూడు రోజుల్లో ముగియనుంది. కాని రోడ్డు మరమ్మతులు మాత్రం మొక్కుబడిగా సాగుతున్నాయి. జాతర సమయంలో వేల మంది ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగిస్తారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.