
మెడికల్ కళాశాలలపై కూటమి నిర్లక్ష్యం
జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు వాటిని ఎందుకు ఎందుకు ప్రారంభించలేదు ? పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన దుర్మార్గుడు బాబు ప్రశ్నించిన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
తిరుపతి రూరల్ : మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడేందుకు శనివారం విద్యార్థి సంఘం నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో మొత్తం 17 మెడికల్ కళాశాలల్లో 5 ప్రారంభం కాగా మరో 7 కాలేజీలు ఎన్నికలు జరిగే సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ తరువాత మరో 5 కాలేజీలను ప్రారంభించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టిపెట్టక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొత్తం 12 మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని బయటకు కనబడకుండా చేయడానికి పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2360 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జగనన్న ప్రభుత్వంలో తెచ్చిన 12 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 2550 సీట్లు పెరిగేవన్నారు. వైద్య విద్యలో ప్రభుత్వం పేద విద్యార్థులకు చేసిన మోసాన్ని బయట పెట్టడానికి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్టు వివరించారు. సమావేశంలో విద్యార్థి విభాగం నేతలు ఓబుల్ రెడ్డి, చెంగల్ రెడ్డి, గూడూరు రఫీ, యశ్వంత్ రెడ్డి, వినోద్ కుమార్, నక్క హరినాథ్, హరీష్, భానుప్రకాష్‌రెడ్డి, నరేశ్, వెంకట రమణ నాయక్, శేషారెడ్డి, రెడ్డి నాయక్ , కరుణాకర్ పాల్గొన్నారు.